మతసామరస్యం చాటిన ముస్లిం యువకుడు ఖలిష్

మతసామరస్యం చాటిన ముస్లిం యువకుడు ఖలిష్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :పాల్వంచ పట్టణంలో మత సామరస్యం వెల్లివిరిసింది. అయ్యప్ప స్వాములకు అన్నదాన వితరణ చేసి ఇతర మతాలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు ముస్లిం యువకుడు ఖలిష్. 
శనివారం పాల్వంచ పట్టణ పరిధి బసవతార కాలనీ లో  వెంకటేశ్వర్లు గురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది.  ఈ క్రమంలోనే కులమతాలకు అతీతంగా  అయ్యప్ప స్వాములకు అన్నదాన వితరణ చేయాలని భావించిన ఖలిష్ ను అయ్యప్ప స్వాములు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు రాపోలు ఆనంద్, ఆకుల హరికృష్ణ, రాబోలి శ్రీశైలం, ఎచ్. మధు, సందీప్, కిరణ్, గిరి ప్రసాద్,150 మంది గురుస్వాములు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.