పాల్వంచలో కాంగ్రెస్ నేతల సంబరాలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది ప్రియాంక గాంధీ తిరుగులేని విజయం సాధించారు.. వయనాడ్ లో నాలుగు లక్షల మెజారిటీతో ఘన విజయం సాధించిన ప్రియాంకా గాంధీ, తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. దీంతో ఆమె గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే శనివారం పాల్వంచ పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఎన్.ఎస్.యు.ఐ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు భార్గవ్ సాయి ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భార్గవ్ సాయి కేక్ కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు.
అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రియాంక గాంధీ విజయంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊతం లభించిందని, ప్రియాంకా గాంధీ గెలుపు భవిష్యత్తు విజయాలకు బాటలు వేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు, యూత్ కాంగ్రెస్ నాయకులు కొమర్రాజు విజయ్, ఓలపల్లి రాంబాబు, శశిధర్ నాయక్, షేక్ షఫీ, అబ్దుల్లా, గుణామృత్, సదాశివ, తరుణ్, సందీప్, అంజి, సాయి మిధున్, పట్టణ కాంగ్రెస్ నాయకులు చింత నాగరాజ్, సాంబయ్య, రాము నాయక్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment