జగన్నాధపురంలో సమగ్ర, కులగణన సర్వేలో పాల్గొన్న డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

 

జగన్నాధపురంలో సమగ్ర, కులగణన సర్వేలో పాల్గొన్న  డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు చేస్తున్న సమగ్ర, కులగణన సర్వేలో భాగంగా శనివారం అధికారులు పాల్వంచలో చేపట్టిన సర్వే కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో జరిగిన సమగ్ర సర్వేలో కొత్వాల మాట్లాడుతూ బలహీనవర్గాలకు అన్ని విధాలా తోడ్పాటు లభించే విధంగా సమగ్ర సర్వే ఏర్పడిందన్నారు. సామాజిక, ఆర్ధిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, సమగ్ర కుల సర్వేతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కొత్వాల అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసీల్దార్ వివేక్, మండల పంచాయితీ అధికారి నారాయణ, పంచాయితీ సెక్రటరీ సాయిరాం, మాజీ జడ్పిటిసి యర్రంశెట్టి ముత్తయ్య, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కాపర్తి వెంకటా చారి, ధర్మసోత్ చిన్న రాములు, కామచారి, బాదర్ల జోషి, తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.