పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరూ యోగాను అలవరుచుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం విధులలో నిమగ్నమై ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరక దృఢత్వంతో పాటు,మానసికంగా కూడా దృఢంగా ఉండేందుకు ఇకపై ప్రతి శుక్రవారం యోగా తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. కావున పోలీసు అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ తరగతుల ఆవశ్యకత తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ తరగతులలో కొత్తగూడెం సబ్ డివిజన్ లోని పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది,ఆర్మడ్ రిజర్వు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,సీఐలు వెంకటేశ్వర్లు, కరుణాకర్,రమేష్,శివప్రసాద్,ఆర్ఐలు లాల్ బాబు,సుధాకర్,నరసింహారావు,కృష్ణారావు, సిబ్బంది హాజరయ్యారు.

Post a Comment