మున్నూరు కాపులకు అండగా ఉంటాం - కాంపెల్లి కనకేష్ పటేల్

మున్నూరు కాపులకు అండగా ఉంటాం - కాంపెల్లి కనకేష్ పటేల్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  మున్నూరు కాపు కులస్తులకు అండగా ఉంటామని తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ అన్నారు. పాల్వంచ మండలం  సోములగూడెం గ్రామంలోని పెద్దినేటి అనసూయ తన అర ఎకరం పొలంలో వరికోత మిషన్ తో వరి కోపిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందింది. మృతురాలు కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం కార్యవర్గ దృష్టికి రావడంతో శనివారం  ఆ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, మున్నూరు కాపు నాయకులు చింతా నాగరాజు, ఆకుల ఆనంద్, మద్దుల వీర మోహన్ రావు, బాలినేని సత్తిబాబు,బాలినేని నాగేశ్వరరావు ల ఆధ్వర్యంలో మున్నూరు కాపు దాతల సహకారంతో 69 వేల రూపాయలను సమకూర్చి మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ అనసూర్య తన పొలంలో మిషన్ తో వరి కోయిస్తున్న సమయంలో  మిషన్ వెనక నిలబడి ప్రమాదవశాత్తు మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. మిషన్ డ్రైవరు వెనక చూసుకోకుండా రివర్స్ రావడంతో ఆమె పైనుండి వరి కోత మిషన్ వెళ్ళింది అని విచారం వ్యక్తం చేసారు. ఆమె మరణం వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. 

పాల్వంచ పట్టణ మండలలోని మున్నూరు కాపు కులంలో ఉన్నటువంటి పేదలను ఆదుకోవడంలో తమ తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు.  గతంలో కూడా మున్నూరు కాపు కులస్తులలోని పలువురికి తమ చేయూతను అందించామని ఇకపై కూడా తమ సేవలను మున్నూరు కాపు కులస్తుల కోసం తమ సేవల  విస్తృతం చేస్తామని అన్నారు.

 ఈ కార్యక్రమంలో నాయకులు చింతా నాగరాజు, ఆకుల ఆనంద్, మద్దుల వీర మోహన్ రావు, బాలినేని సత్తిబాబు, బాలినేని నాగేశ్వరరావు, వీసంశెట్టి విశ్వేశ్వర రావు, మేడిశెట్టి సాంబశివరావు, గోవాడ రవి, గల్లా శోభన్ బాబు, ముళ్ళపాటి శ్రీకాంత్,  జమ్ముల శివ, బాలినేని వీరయ్య, పూజల ప్రసాద్, మూలగుండ్ల ప్రేమ్ కుమార్, ఎలికే వెంకట్రావు,తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.