ఉప్పొంగిన అభిమానం...అట్టహాసంగా సూరజ్ తివారి జన్మదిన వేడుకలు

ఉప్పొంగిన అభిమానం...అట్టహాసంగా సూరజ్ తివారి జన్మదిన వేడుకలు

జె.హెచ్.9.మీడియా, హైదరాబాద్ : టిపిసిసి కార్యదర్శి సూరజ్ తివారి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రముఖులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సూరజ్ తివారి కి శుభాకాంక్షలు తెలిపారు.  

సూరజ్ తివారి జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా పలువురు తీసుకొచ్చిన కేక్‌లను కట్‌ చేయించి, శాలువాలు కప్పి, బొకేలు, జ్ఞాపికలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 

ఇందులో భాగంగానే  టీపీసీసీ కార్యదర్శి సూరజ్ తివారీ తో ఫతేనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి ముదిరాజ్ కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.

 అనంతరం క్రాంతి ముదిరాజ్ మాట్లాడుతూ కార్యకర్తల వెన్నంటే ఉంటూ వారికి ఏ చిన్న కష్టం వచ్చినా అండగా ఉంటున్న సూరజ్ తివారి సేవల అభినందనీయం అన్నారు. సూరజ్ తివారి ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదినం వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో ఎం.కిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం రాము, ఫతేనగర్ శివాలయం ఆలయ చైర్మన్ నర్సింగ్ రావు, కంచి రాజుకుమార్, స్థానిక వ్యాపారి జి.బాల్‌ రాజ్, శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.