పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో శనివారం పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వనమా నగర్, హమాలి కాలనీలలో పోలీసులు కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అక్కడ ఉన్న ప్రతి ఇంటిని సోదా చేసి ప్రతి ఒక్కరి వివరాలను అడిగి నమోదు చేసుకున్నారు. మొత్తం 250 ఇండ్లను సోదా చేయగా సరైన పత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలు,2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అనుమానిత వ్యక్తుల ఇళ్లల్లో పోలీస్ జాగిలం చేత సోదాలు జరిపారు.


ఈ సందర్భంగా పాల్వంచ సీఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ తమ ప్రాంతంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు అందించి బాధ్యతగా వ్యవహరించాలని గ్రామస్తులకు సూచించారు.తమ తమ ఏరియాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ టౌన్ ఎస్సైలు సుమన్,జీవన్ కుమార్,పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్, ములకలపల్లి ఎస్సై రాజశేఖర్, స్పెషల్ పార్టీ సిబ్బంది,స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





Blogger ఆధారితం.