సేవల ఫలితంగానే సిపిఐకి ప్రజాదరణ - ఎమ్మెల్యే కూనంనేని

సేవల ఫలితంగానే సిపిఐకి ప్రజాదరణ - ఎమ్మెల్యే  కూనంనేని

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  ప్రజా క్షేత్రంలో ఉంటూ అన్నివర్గాల ప్రజలకు అందిస్తున్న సేవల ఫలితంగానే సీపీఐ కి రోజురోజుకు జనాదరణ పెరుగుతోందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగు లోని బంజారా కాలనీలో ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. 

ఈ సందర్బంగా బంజారా కాలనీకి చెందిన వంద కుటుంబాలు బోడ బీమా నాయక్, బట్టు రాందాస్ నాయక్, శ్రీనివాస్, బానోతు దివ్య, బానోత్ స్వామి నేతృత్వంలో కూనంనేని సమక్షంలో సిపిఐ లో చేరాయి. వారికి పార్టీ కండువా కప్పి కూనంనేని ఆహ్వానించారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ గడిచిన 11 నెలలుగా నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిస్కారంకోసం శక్తివంచన లేకుండా కృషి చేశానని అన్నారు. ప్రజల మౌలిక అవసరాలైన తాగునీరు, వైద్యం, రహదారుల సౌకర్యం వంటివి సమస్యలకు శాశ్వత పరిస్కారం చూపేందుకు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నానన్నారు. పార్టీలో చేరుతున్నవారు సిపిఐ, అనుబంధ ప్రజాసంఘాల బాధ్యతలు తీసుకొని ప్రజా సమస్యల పరిష్కరంకోసం కృషి చేయాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అవసరమైతే పోరాటాలు నిర్వహించాలని సూచించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ ఈ దేశంలో 100 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, డిసెంబర్ 26 నాటికి పార్టీ వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో గ్రామగ్రామాన వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించి పార్టీ చరిత్రను, త్యాగాలను ప్రజలకు వివరించాలని సూచించారు. 

ప్రతి గ్రామం, బస్తీలో ఉత్సవాలు ఘనంగా జరిగేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. తాడిత పీడిత ప్రజల పక్షాన భూమి భుక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించిన, పేదలకు వేల ఎకరాల భూమిని పంచిన చరిత్ర సిపిఐకి ఉందని అన్నారు.  పేద ప్రజల కోసం ప్రజా పోరాటాల్లో ప్రాణాలర్పించిన అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, సిపిఐ పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, వీ.పద్మజ, ఏఐటీయూసీ నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, ఇట్టి వెంకట్రావు, వై.వెంకట్రామయ్య, మన్నెం వెంకన్న, రెహమాన్, కరీం, జకరయ్య, సత్యనారయణ, వైఎస్ గిరి, వేములపల్లి శేఖర్, మాజీ సర్పంచ్ భూక్యా విజయ్, మాజీ ఎంపీటీసీ రవి, మాజీ కౌన్సిలర్ చెన్నయ్య, కొంగర అప్పారావు, బాణోత్ రంజిత్, సాయిలు శ్రీను, శ్రీనివాసరావు, వెంకన్న, రేగు కృష్ణమూర్తి, రాము, కృష్ణ, ఆదినారాయణ, లాల్ పాషా, గురుమూర్తి, చంద్రశేఖర్, రాందాస్, ఖాసిం, విజయ్ కుమార్, అల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.