పాల్వంచ అయ్యప్పస్వామి దేవాలయంలో ఘనంగా మండలపూజా మహోత్సవాలు ప్రారంభం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : తెలంగాణా రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా కీర్తింపబడుతున్న పాల్వంచ అయ్యప్పస్వామి దేవాలయంలో మండలపూజా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేరళ తంత్రీ బ్రహ్మశ్రీ మాధవన్ నంబుత్రి ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గణపతి హోమం, అభిషేకం, మండల పూజ ప్రారంభ ధ్వజారోహణం, పూలాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ వ్యాపారస్తులు చావా కిషోర్ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం జరిపారు.
అనంతరం జరిగిన ప్రత్యేక పూజల్లో డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో పూజారి బృందావనం నర్సింహమూర్తి, కమిటీ సభ్యులు మేడిద సంతోష్ గౌడ్, కాల్వ భాస్కర్ రావు, బందెల శ్రీనివాస్, కనగాల రాంబాబు, మిరియాల కమలాకర్, బండి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.


Post a Comment