పాల్వంచలో ఇందిరా గాంధీ విగ్రహం పునఃప్రతిష్ట.. కాంగ్రెస్ నేతల సంబరాలు

పాల్వంచలో ఇందిరా గాంధీ విగ్రహం పునఃప్రతిష్ట.. కాంగ్రెస్ నేతల సంబరాలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఎన్నో ఏళ్లగా పాల్వంచ దమ్మపేట సెంటర్ లో ఉన్న ఇందిరా గాంధీ  విగ్రహాన్ని గత ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్థానిక మున్సిపల్ సిబ్బంది తొలగించి పక్కన పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. 

అప్పట్లో ఇందిరాగాంధీ విగ్రహాన్ని తొలగిస్తే సహించమంటూ పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు, నాయకులు బద్ది కిషోర్, వానపాకల రాంబాబు, చెట్టు శ్రీను, వీరయ్య చౌదరి పార్టీ శ్రేణులతో కలిసి దమ్మపేట సెంటర్ లో రాస్తారోకో నిర్వహించి పెద్ద ఎత్తున తమ నిరసన ను తెలిపారు. దీంతో పోలీసులు వారిని అదుపులో తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు..

నిరసన తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు (ఫైల్ ఫోటో)

ఇక కాంగ్రెస్ సర్కార్ రావడంతో.

పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు ఆధ్వర్యంలో దమ్మపేట సెంటర్‌లో ఇందిరాగాంధీ విగ్రహాన్ని పునర్ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు. మంగళవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన ఇందిరాగాంధీ  విగ్రహాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోదెం వీరయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పాల్వంచ దమ్మపేట సెంటర్‌లో తొలగించిన ఇందిరా గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్టించడానికి ఎంతో కృషి చేసిన పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావును ప్రత్యేకంగా అభినందించారు. 

రంగారావు ను అభినందిస్తున్న పోదెం వీరయ్య 

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న, టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని, మోతుకూరు దుర్గారావు, JB శౌరి, ఎడవల్లి కృష్ణ, అర్జునరావు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, 

జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవికుమార్, పసుపులేటి వీరబాబు, సుజాతనగర్ మండల అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్, చుంచుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంతోటి పాల్, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండెం వెంకన్న, ఎస్టీ సెల్ నాయకులు బట్టు మురళి నాయక్, ఎస్సీ సెల్ నాయకులు పెంకి శ్రీనివాసరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతా వెంకట్రావు, జాలి జానకి రెడ్డి, మహిపతి రామలింగం, కాల్వ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు..


Blogger ఆధారితం.