ఎస్.ఆర్.అండ్ బిజీ ప్రభుత్వ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం

ఎస్.ఆర్.అండ్ బిజీ ప్రభుత్వ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఎన్.సి.సి.11 తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్.సి.సి. డేను ఘనంగా నిర్వహించారు. ఎన్.సి.సి. డేను పురస్కరించుకొని ఖమ్మం పట్టణంలోని పురవీధుల్లో రక్తదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిజీ ఎన్.ఆర్. ప్రభుత్వ కళాశాల ఆవరణలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

అనంతరం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎండి జకీరుల్లా మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన ఆరోగ్యవంతులైన స్త్రీ, పురుషులు ఎవరైనా రక్తదానం చేయవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్.సి.సి. ఆఫీసర్ లెఫ్ట్నెంట్ డాక్టర్ కే.ఓంకార్, ఎన్.సి.సి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ నవీన్ యాదవ్, జె.సి.ఓ. రాజారాం, కళాశాల అధ్యాపకులు డాక్టర్ బానోతూ రెడ్డి, కె.ఎల్.ఎన్. శాస్త్రి, డాక్టర్ రమా సత్యవతి, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ కవిత, ఇంద్రాణి, శ్రీనివాస్, డా. సునీత, డా. పూర్ణచందర్, డా. సీతారామారావు, పట్టణంలోని వివిధ కళాశాలల ఎన్.సి.సి. క్యాండిడేట్స్, అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్.సి.సి. ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.