చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ చాటిన స్వాతి స్కూల్ విద్యార్థులు

చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ చాటిన స్వాతి స్కూల్ విద్యార్థులు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండల స్థాయిలో జరిగిన చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో పాల్వంచ స్వాతి స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభ ను చాటారు. శుక్రవారం స్థానిక బొల్లోరుగూడెం ప్రభుత్వ హై స్కూల్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో స్వాతి స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభను ప్రదర్శించి బహుమతులను సొంతం చేసుకున్నారు.

పోటీల్లో గెలుపొందిన  విద్యార్థులు కె.అభినవ సాయి (10వ తరగతి), కె.జోసహస్ర (9వ తరగతి), జె.ఆదర్శ్ లకు పాల్వంచ గిరిజన బాలుర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలు బహుమతులు అందజేశారు. 

ఈ సందర్భంగా స్వాతి స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ చౌదరి, ప్రిన్సిపాల్ నీలిమ చౌదరి, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రశంసించారు.

అనంతరం  వారు మాట్లాడుతూ  “విద్యార్థుల విజయం మా స్కూల్ కు గర్వకారణం. ఈ తరహా పోటీలు విద్యార్థుల సృజనాత్మకతను పెంచి, భవిష్యత్తులో మెరుగైన విజయాలకు పునాదిగా నిలుస్తాయి” అని తెలిపారు.

విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది చెకుముకిపోటీల్లో స్వాతి స్కూల్ విద్యార్థులు బహుమతులు సాధించడం పట్ల  హర్షం వ్యక్తం చేస్తూ, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Blogger ఆధారితం.