భద్రాచలం స్పెషల్ సబ్ జైల్ ను సందర్శించిన న్యాయమూర్తి జి.భానుమతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : భద్రాచలం స్పెషల్ సబ్ జైల్ ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి.భానుమతి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా విచారణ ఖైదీల సమస్యలు, వారికి అందుతున్న మౌలిక వసతులు, ఆహారం, ఆరోగ్యం వంటి అంశాలను ఆమె సమీక్షించారు.మహిళా ఖైదీల సమస్యలపై ప్రత్యేకంగా ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, స్పెషల్ సబ్ జైలు సూపరింటెండెంట్ ఉపేందర్, న్యాయవాది మెండు రాజమల్లు, భద్రాచలం జైలు విస్టింగ్ లాయర్స్ బాసం శారద, భద్రాచలం టౌన్ ఎస్సై జి విజయలక్ష్మి, జైలు క్లినిక్ సభ్యులు బండారు రమేష్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.


Post a Comment