డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి


జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల సంఘం లైబ్రరీ హాల్లో గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. 

 ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలి డిజిటల్ లైబ్రరీని కొత్తగూడెం బార్ అసోసియేషన్ లో ప్రారంభించుకోవడం  చాలా శుభపరిణామం అని, న్యాయవాదులు డిజిటల్ లైబ్రరీని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా తమ వృత్తి నైపుణ్యతను మెరుగుపరుచుకోవచ్చు అని అన్నారు. 

జూనియర్ న్యాయవాదులు సమయం వృధా చేయకుండా రెగ్యులర్ గా డిజిటల్ లైబ్రరీలో వచ్చే తీర్పులను చదువుకొని తద్వారా వృత్తిలో మెలకువలను నేర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు గొల్లపూడి భానుమతి, ఏ.సుచరిత, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, న్యాయవాదులు  యం.డి. సాదిక్ పాషా, సందుపట్ల ప్రవీణ్ కుమార్, దూదిపాల రవికుమార్,పీపీలు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు..



Blogger ఆధారితం.