న్యాయ సేవాధికార సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోండి - న్యాయమూర్తి జి.భానుమతి

న్యాయ సేవాధికార సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోండి - న్యాయమూర్తి జి.భానుమతి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి.భానుమతి సూచించారు.

 జాతీయ న్యాయ సేవాధికార దినోత్సవం సందర్భంగా శుక్రవారం జూలూరుపాడు లోని కస్తూరిబా గాంధీ బాలికల  విద్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ చైతన్య కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయమూర్తి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా న్యాయమూర్తి జి.భానుమతి మాట్లాడుతూ సమాజంలో పేద, బడుగు బలహీన వర్గాల వారు ఉచిత న్యాయ సేవలను పొందేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను వినియోగించుకోవాలని తెలిపారు. లీగల్ సర్వీసేస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం ప్రతి సంవత్సరం నవంబర్ 9న  జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవంను జరుపుకోవడం జరుగుతుందన్నారు.   అనంతరం న్యాయమూర్తి హాస్టల్ ను తనిఖీ  నిర్వహించారు. కిచెన్ రూమ్,  స్టోర్ రూమ్ ను పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహారం, నాణ్యమైన విద్యను అందించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి, న్యాయవాది తెల్లబోయిన రమేష్, పాఠశాల  ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు విద్యార్థులు  పాల్గొన్నారు.

Blogger ఆధారితం.