బాల కార్మికులకు విముక్తి కలిగించాలి - న్యాయమూర్తి జి.భానుమతి

బాల కార్మికులకు విముక్తి కలిగించాలి - న్యాయమూర్తి జి.భానుమతి


జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  బాల కార్మికులకు విముక్తి కలిగించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు.   తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ - హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం "బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన"  క్యాంపెన్ లో భాగంగా మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి  పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్ లో గల పలు వస్త్ర దుకాణాలు, లాడ్జిలను, శాస్త్రి రోడ్,  మార్కెట్ ఏరియాలను ఆకస్మిక తనిఖి చేశారు. 

అనంతరం స్థానిక హమాలీలతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా బడిలో చేర్పించాలని,18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని అన్నారు. బాల కార్మిక చట్టం ప్రకారం చిన్నారులను పనిలో పెట్టుకున్న యజమానిపైన  కేసును నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. బాల కార్మిక నిర్మూలనకు సంబంధించి తల్లిదండ్రులలో అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. 

ఈ తనిఖీలలో పాల్వంచ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నాగరాజు, ఇల్లందు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శాస్త్రి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు, తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.