భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న న్యాయమూర్తి జి.భానుమతి

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న న్యాయమూర్తి జి.భానుమతి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని భద్రాద్రికొత్తగూడెం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, న్యాయమూర్తి గొల్లపూడి భానుమతి శుక్రవారం దర్శించుకున్నారు. 

ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తి కి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో  డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పట్టుపల్లి నిరంజన్ రావు, లీగల్ సర్వీసెస్ మెంబెర్ మెండు రాజమల్లు, భద్రాచలం స్పెషల్ జైల్ సూపరింటెండెంట్ యు.ఉపేందర్, భద్రాచలం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ జి.విజయలక్ష్మిలు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.