కోఠి మోతి మార్కెట్‌లో మేయర్ ఆకస్మిక తనిఖీలు... వెలుగులోకి సంచలన నిజాలు

కోఠి మోతి మార్కెట్‌లో మేయర్ ఆకస్మిక తనిఖీలు... వెలుగులోకి సంచలన నిజాలు

జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్  : కోఠి మోతి మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన ఆకస్మిక తనిఖీలలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

తనిఖీల సమయంలో, కట్ చేసిన చికెన్‌ను ఎలుకలు, పందికొక్కులు తింటున్న దృశ్యాలు మేయర్‌ను షాక్‌కు గురి చేశాయి. ఈ చికెన్‌ను హోటల్స్‌కు సరఫరా చేస్తున్న వ్యాపారులపై మేయర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొన్ని చికెన్ షాపుల్లో చనిపోయిన కోళ్లను అమ్ముతున్నట్లు గుర్తించిన మేయర్, ఆ షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


తదుపరి తనిఖీలలో, ఫ్రిజ్లో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్ సిటీలోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లకు తక్కువ ధరలకు అమ్ముతున్నట్లు తేలింది.

దీంతో వెంటనే మేయర్ మోతీ మార్కెట్లో పలు చికెన్ షాపులను సీజ్ చేయించి, వాటి ట్రేడ్ లైసెన్సులు రద్దు చేశారు.

కుళ్ళిన చికెన్ అమ్మకాలు సాగిస్తున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు.

Blogger ఆధారితం.