అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజ్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం సందర్శించారు. ముందుగా, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, అక్కడి పోలీస్ సిబ్బంది క్వార్టర్స్ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో పెండింగ్‌లో ఉన్న కేసులను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, ఏమైనా సందేహాలు ఏర్పడితే ఉన్నతాధికారుల సలహాతో న్యాయాధికారులతో సమన్వయం కాపాడుతూ వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పోలీస్ స్టేషన్లలో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడంలో కృషి చేయాలని తెలిపారు.
కోడిపందాలు, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న అధికారుల, సిబ్బంది పనితీరు గురించి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సీఐ కరుణాకర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సైలు యాయాతి రాజు, శివరామకృష్ణ, దమ్మపేట ఎస్సై కిషోర్ రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment