టి.ఎల్. సి. ఏ అధ్యక్షుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసి 'సుమంత్'
జె.హెచ్.9. మీడియా, వెబ్ డెస్క్ :అమెరికా, న్యూయార్క్ లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టి.ఎల్.సి.ఏ) నూతన అధ్యక్షుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కు చెందిన సుమంత్ రామ్ శెట్టి ఎన్నికవ్వడం పట్ల నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పాల్వంచ పట్టణ పరిధి వనమా కాలనీ లోని నేతాజీ యువజన సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్.జె.కె. అహ్మద్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన టి.ఎల్.సి.ఏ ఎన్నికల్లో సుమంత్ ఘన విజయం సాధించడం అభినందనీయం అని అన్నారు.
![]() |
| టి.ఎల్.సి.ఏ అధ్యక్షుడు సుమంత్ తో అహ్మద్ |
ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసి సుమంత్ అమెరికాలో ప్రతిష్టాత్మకమైన తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టి.ఎల్.సి.ఏ) కి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గర్వించదగ్గ విషయం అని అన్నారు.
తెలుగు వారి శ్రేయస్సు కోసం సుమంత్ ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఇకపై సుమంత్ పై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు సయ్యద్ అక్బర్, సయ్యద్ అంజద్, స్టాలిన్, యం.డి. రజాక్, యం.డి.రావూఫ్ తదితరులు పాల్గొన్నారు.

.webp)
Post a Comment