టి.ఎల్.సి.ఏ అధ్యక్షుడు సుమంత్ రామ్ శెట్టి కి అభినందనల వెల్లువ
జె.హెచ్.9. మీడియా, వెబ్ డెస్క్ :అమెరికా, న్యూయార్క్ లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (T.L.C.A) - 2025 నూతన అధ్యక్షుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కు చెందిన సుమంత్ రామ్ శెట్టి ఎన్నికవ్వడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసి సుమంత్ అమెరికాలో ప్రతిష్టాత్మకమైన తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టి.ఎల్.సి.ఏ) కి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎంతో గర్వ కారణమని సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని నేతాజీ యువజన సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె.అహ్మద్ సంఘం కార్యవర్గ బృందంతో కలిసి సుమంత్ కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
టిఎల్‌సిఎ 2025 నూతన కార్యవర్గం విషయానికొస్తే..
- అధ్యక్షుడిగా సుమంత్ రామ్‌శెట్టి,
- ఉపాధ్యక్షురాలుగా మాధవి కోరుకొండ,
- సెక్రటరీ గా శ్రీనివాస్ సనిగెపల్లి,
- ట్రెజరర్ అరుంధతి అదుప,
- ఎక్స్ అఫిషియో పాస్ట్ ప్రెసిడెంట్ గా కిరణ్ రెడ్డి పర్వతాల,
- జాయింట్ సెక్రటరీ గా భగవాన్ నడిరపల్లి,
- జాయింట్ ట్రెజరర్ గాలావణ్య అట్లూరి, సునీల్ చల్లగుల్ల, దివ్య దొమ్మరాజు, ప్రవీణ్ కరణం, సుధ మన్నవ, సునీత పోలెపల్లి సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.

.webp)
.webp)
Post a Comment