వృద్ధుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు - న్యాయమూర్తి జి.భానుమతి

వృద్ధుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు - జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : వృద్ధుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని న్యాయమూర్తి జి.భానుమతి అన్నారు. మంగళవారం భద్రాచలం కూనవరం రోడ్డులోని మానవసేవ వాలంటరీ ఆర్గనైజేషన్ నందు జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి జి.భానుమతి  హాజరయ్యారు.  

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత వారి పిల్లలదేనన్నారు. నిరాధారణకు  గురైన వారు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం ఆర్డిఓ కోర్టులో దరఖాస్తు చేస్తే  సమస్యను పరిష్కరిస్తారన్నారు. సీనియర్ సిటిజన్స్  ఒంటరితనాన్ని జయించి మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలని ఆమె సూచించారు.

 అనంతరం  వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మెండు రాజమల్లు, సరోజినీ, రఫీ,  ప్రిన్సిపల్  కృష్ణకుమారి   తదితరులు పాల్గొన్నారు..



Blogger ఆధారితం.