జగన్మాత దయ ఉంటే లోకమంతా సుభిక్షం - కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: అమ్మలు కన్నా అమ్మ పెద్దమ్మ జగన్మాత దయ ఉంటే లోకమంతా సుభిక్షంగా ఉంటుందని డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మండపాల్లో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో కొత్వాల పాల్గొన్నారు. గురువారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పాత పాల్వంచ మైసమ్మతల్లి ప్రాంగణంలో, సంజయ్ నగర్ మహాలక్ష్మమ్మతల్లి దేవాలయంలో, జ్యోతి నగర్ అమ్మవారి దేవాలయంలో, బొల్లోరిగూడెం శ్రీ లలిత కామేశ్వరిస్వామి దేవాలయంలో, రామాలయం వద్ద, చాకలి బజార్ లో ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్టల్లో కొత్వాల పాల్గొని పూజలు చేశారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా శుభమే జరుగుతుందని అన్నారు. నిత్యం అమ్మవారిని కొలిస్తే ఏ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు ఎస్.వి.ఆర్.కె.ఆచార్యులు, చింతా నాగరాజు, వై. వెంకటేశ్వర్లు, కాపర్తి వెంకటాచారి, అశ్విన్, హర్షవర్ధన్, బాడిశ శంకర్ రావు, సురేష్, యశ్వంత్, కంచర్ల బాలకృష్ణ, సునీల్, మసనం శరత్, వంగా రమేష్, కిరణ్, మల్లేష్, ధర్మరాజుల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment