భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన డిజిటల్ కార్డు సర్వే

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన డిజిటల్ కార్డు సర్వే

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియ గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైంది.డిజిటల్ కార్డు సర్వేలో భాగంగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి సర్వేలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ డిజిటల్ కార్డు జారీ చేసేందుకు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో ఏడు గ్రామాలు, మూడు మున్సిపాలిటీలలోని వార్డులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. లక్ష్మీదేవి పల్లి మండలం లాల్ తండా పంచాయతీలో 171 కుటుంబాలు, పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో 330 కుటుంబాలు, దమ్మపేట మండలం ఆళ్లపల్లి పంచాయతీలోని 175కుటుంబాలు, ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో 178 కుటుంబాలు, అశ్వాపురం మండలం చందర్లపాడు పంచాయతీలోని 190 కుటుంబాలు, మణుగూరు మున్సిపాలిటీలోని 6వ వార్డులో 248 కుటుంబాలు, చర్ల మండలం పులిగుండాల గ్రామంలో 190 కుటుంబాలు, భద్రాచలం గ్రామ పంచాయతీలోని 9వ వార్డులో 280 కుటుంబాలు, దమ్మపేట మండలం ఆళ్లపల్లి గ్రామంలోని 175 కుటుంబాలు, ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలోని 178 కుటుంబాలు, ఇల్లందు మండలం పూబెల్లి పంచాయతీలోని 172  కుటుంబాలు, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులో 310 కుటుంబాలకు  ఈ కుటుంబ సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 

కుటుంబ డిజిటల్ కార్డ్ లో కుటుంబ వివరాలను ఎటువంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సర్వేలో కుటుంబ సభ్యుల పేర్లు, పుట్టిన తేదీ, ఇంటి యజమానితో గల సంబంధం తదితర వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులకు తెలిపారు. కుటుంబంలో చనిపోయిన, వివాహం చేసుకొని వెళ్లిన వారి వివరాలను తొలగించాలన్నారు. కొత్తగా వివాహమై కుటుంబంలోకి వచ్చిన వారి వివరాలను,  పిల్లల వివరాలను నమోదు చేయాలని తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమతితో గ్రూప్ ఫోటో  పొందుపరచాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

 ఈ సర్వేలో అదనపు కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తాహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.