కేటీఆర్, హరీష్ రావులపై కేసు నమోదు
జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం బిజెపి నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్ లపై ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment