డిజిటల్ కార్డ్ సర్వేను సద్వినియోగం చేసుకోండి - నూకల రంగారావు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు కోరారు. శనివారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు లో అధికారులు నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని తహసిల్దార్ వివేక్ తో కలిసి నూకల రంగారావు పరిశీలించారు.
ఈ సందర్భంగా పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు మాట్లాడుతూ అధికారులను అడిగి రంగారావు సర్వే వివరాలు తెలుసుకున్నారు. 10వ వార్డు ప్రజలు తమ కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్.డి.ఎం. కోఆర్డినేటర్ బద్ది కిషోర్, పాల్వంచ పట్టణ కాంగ్రెస్ నాయకులు కొమర్రాజు విజయ్, సాంబయ్య, మైనారిటీ కాంగ్రెస్ నాయకులు ఇమ్మానుయేల్, అబ్దుల్లా, హుస్సేన్ నాయక్, ఇమ్రాన్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఓలపల్లి రాంబాబు భార్గవ్, సుమన్ నాయక్, ఆర్.ఐ రవీందర్, డ్వాక్రా గ్రూప్స్ ఇంచార్జ్ డి. బుజ్జి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
.webp)
Post a Comment