రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ కార్ద్ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి - కొత్వాల

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి -  కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఒక్క కార్డుతోనే ప్రభుత్వ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఫ్యామిలీ  డిజిటల్ కార్ద్ సర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. 

పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు వర్తక సంఘం ప్రాంతంలో అధికారులు నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని తహసీల్దార్ వివేక్ తో కలిసి కొత్వాల పరిశీలించారు. 

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో గతంలో లేని రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు లేని వివరాలను ఇందులో తేలుపవచ్చన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు పొందాడనియూకి ఈ డిజిటల్ కార్డు మాత్రమే ప్రామాణికం అన్నారు. కుటుంబానికోక డిజిటల్ కార్డు అందజేసి, దానిలో అన్ని వివరాలు పొందుపరుస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల కోరారు. 

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వివేక్, ఆర్.ఐ.రవికుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎస్.వి.ఆర్.కె.ఆచార్యులు, కాపర్తి వెంకటాచారి, బాలినేని నాగేశ్వరరావు, కందుకూరి రాము, పాబోలు నాగేశ్వరరావు, బాడిశ శంకరరావు, హర్షవర్ధన్, సురేష్, సాయి, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.