సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం

జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్: సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి మృతిచెందింది. 38 ఏండ్ల గాయత్రికి గత రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలోనే వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు. చిన్న వయసులోనే కూతురు ప్రాణాలు కోల్పోడాన్ని  చూసి రాజేంద్రప్రసాద్ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

గాయత్రి పార్థీవ దేహాన్ని  KPHB కాలనీలోని ఫార్చ్యూన్ విల్లా 226 రాజేంద్రప్రసాద్ నివాసంలో సందర్శనకు ఉంచారు. ఈ వార్త తెలిసిన సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ఆయన ఇంటికి వెళ్లి రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు.

అయితే గాయత్రి కూతురు తేజస్విని చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలలో నటించింది. మహానటి సినిమాలో సావిత్రి చిన్నప్పటి పాత్ర వేసింది గాయత్రి కూతురే. రాజేంద్రప్రసాద్ కూతురు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

Blogger ఆధారితం.