కాలినడకన గండ్రబంధం గ్రామానికి కూనంనేని..

కాలినడకన గండ్రబంధం గ్రామానికి కూనంనేని..

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: రెండు కిలోమీటర్ల మేర కాలినడకన.. మరో రెండు కిలోమీటర్లు ట్రాక్టరుపై ప్రయాణించి గండ్రబంధం గ్రామాన్ని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు చేరుకున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని చింతకుంట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గండ్రబంధం గ్రామం మారుమూల గ్రామానికి చెందిన మాజీ సర్పంచి తాటి రాధమ్మ భర్త సీనియర్ కార్యకర్త తాటి వెంకటేశ్వర్లు ఇటీవలే మృతి చెందారు. అతని సంస్మరణ సభ హాజరైన కూనంనేని కుటుంబ సభ్యులను ఓదార్చరు. 

అనంతరం గ్రామస్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ గండ్రబంధం గ్రామం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధిలో తిరోగమిస్తోందని, గ్రామస్థుల గోడు పాటించుకోలేదని, గండ్రబంధం అని ఒక గ్రామం ఉందన్న విషయాన్ని విస్మరించి నిర్లక్ష్యం చేశారన్నారు. కిన్నెరసాని రెండు వాగులకు మధ్యలో గ్రామం ఉండటం వలన ప్రతియేటా గ్రామం ముంపుకు గురవుతోందని, ఈ గ్రామాన్ని చింతకుంటకు సమీపంలోపి తరలించేందుకు చర్యలు చేపట్టాడతామన్నారు. ముంపు సమస్యను అక్కడినుంచి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామం తరలింపు వరకు ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తాన్నానను. కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె  సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాసరావు, నాయకులు దీటి లక్ష్మీపతి, జలీల్ పాషా, కంటెం సత్యనారాయణ, దేవరగట్ల రాంబాబు, జోగా రాజబాబు, లక్ష్మి నారాయణ, రాంబాబు, గ్రామస్థులు ఉన్నారు.

Blogger ఆధారితం.