దివ్యాంగులు శిబిరాలు సద్వినియోగం చేసుకోండి - కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలో దివ్యాంగుల సహాయ ఉపకరణముల కొరకు అక్టోబర్ 08 నుండి 11 వరకు అర్టిఫిషియల్ లింబ్ మాన్యుఫ్యాక్షరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సహాకారంతో ఎంపికా శిబిరములు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న మండల పరిషత్ కార్యాలయము-గుండాల, 9న మండల పరిషత్ కార్యాలయము- అశ్వారావుపేట , 10న మండల పరిషత్ కార్యాలయము-భద్రాచలం, 11న ఐడిఓసి కార్యాలయము-పాల్వంచ నందు బ్యాటరీ ట్రైసైకిల్స్, ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు, ఆంథుల చేతికర్రలు, కృత్రిమ అవయవాలు, చంకకర్రలు కొరకు ఎంపిక శిబిరములు నిర్వహించబడును అని తెలిపారు. ఈ సహాయ ఉపకరణములు కొరకు హాజరయ్యే వారు యుడిఐడి కార్డు, సదరమ్ సర్టిఫికెట్, ఆదాయం/ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, (2) పాస్ ఫోటోలతో రవాణా సౌకర్యం అనుకూలంగా ఉన్న ఎంపికా శిబిరమునకు కావాల్సిందిగా కోరారు. ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు . ఇతర వివరములకొరకు 6301981960, 8331006010, 8096697365 నెంబర్లకు సంప్రదించాలని ఆయన కోరారు.

Post a Comment