ఎమ్మెల్యే కూనంనేని కి మెప్మా ఆర్పీల వినతి

ఎమ్మెల్యే కూనంనేని కి మెప్మా ఆర్పీల వినతి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  మెప్మా డిపార్ట్మెంట్ లో రిసోర్స్ పర్సన్స్ ఆర్పీ లుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం చట్టం ప్రకారం 26 వేలు వేతనం ఇచ్చేలా చర్యలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కూనంనేని  సాంబశివరావు కు ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బండి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో  వినతిపత్రం  అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో  డ్వాక్రా గ్రూప్ ల ద్వారా మహిళలకు పొదుపు,ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధి అందించి అభివృద్ధి కోసం నిరంతరం బేస్ లెవల్ లో పనిచేస్తున్న ఆర్పి లను..మెప్మా డిపార్ట్మెంట్ విధులుతో పాటు మున్సిపల్ శాఖ , రెవిన్యూ, ఎన్నికలు విధులు, హెల్త్ డిపార్ట్మెంట్, బ్యాంక్ లు, ఇలా అనేక శాఖలలో పనిచేయిస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో ఆర్పీ లు మొగిలి సంధ్య,దుర్గశ్వరి. సుబద్ర, రాణి, కృష్ణవేణి, అది లక్ష్మి, నాగమణి,సామ్రాజం, తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.