పాల్వంచలో డయాలసిస్ యూనిట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్ ను కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 10 బెడ్లతో కొత్తగూడెంలో ఉన్న రోగుల సంఖ్యకు అనుగుణంగా మిషన్లు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర డయాలసిస్ రోగులు ఇల్లందు, భద్రాచలం తోపాటు ఇతర ప్రాంతాలకు వెళుతూ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి పెద్దమొత్తంలో నష్టపోతున్నారని తన దృష్టికి వచ్చిన వెంటనే వైద్యశాఖ మంత్రి, అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు పంపి 40 లక్షల రూపాయలతో ఇక్కడ యూనిట్ ప్రారంభించామని, యూనిట్ ప్రారంభంతో ఈ ప్రాంత రోగుల బాధలు తీరుతాయని అన్నారు.
రూ: 79 లక్షలతో ఆసుపత్రి ఆధునీకరణ పనులు కోసం ప్రతిపాదనను పంపగా పరిపాలన అనుమతులు వచ్చాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. విద్య, వైద్యంకు తన మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. వివిధ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చే రోగులతో వైద్యులు వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సరైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసిల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ డాకు నాయక్, ఎంపిడిఓ విజయ్ భాస్కర్ రెడ్డి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవిబాబు, ఇన్చార్జి DM & Ho డాక్టర్ సుకృత , సీనియర్ వైద్యులు డాక్టర్ సూర్యదేవర రామమోహనరావు, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల్ శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు నరాటి ప్రసాద్, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, డి సుధాకర్, వీ పద్మజ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు, సీపీఐ నాయకులు వెంకటేశ్వర్లు, ఇట్టి వెంకట్రావు, శనగారపు శ్రీనివాసరావు, మన్యం వెంకన్న, జకరయ్య, నరహరి నాగేశ్వరరావు, వైఎస్ గిరి, రెహమాన్, కరీం, లాల్ పాషా, ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు పగిడిపల్లి మనోహర్, భట్టు మురళీ, దుర్గ మహేష్, రాము, శాంతవర్థం, హాస్పటల్ సూపర్డెంట్, ఆర్ ఎం ఓ ఆరోగ్యశ్రీ అధికారులు, డయాలసిస్ అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.webp)

Post a Comment