దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోండి - అదనపు కలెక్టర్

 

దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోండి - అదనపు కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.

ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు.

గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు..

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఫై ఆర్ ఓ అడ్డు కూలీల ఏరియాలో సింగరేణి సంస్థ భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని తొలగించాల్సిందిగా బానోత్ హరి చేసిన దరఖాస్తును పరిశీలించి, తగు చర్యలు నిమిత్తమై  మున్సిపల్ కమిషనర్ కొత్తగూడెంకు ఎండార్స్ చేశారు.

లక్ష్మీదేవి పల్లి మండలం హార్య తండా గ్రామం లో నివసిస్తున్న జాటోత్ సామకు w/o శ్రీను సర్వేనెంబర్ 123 /ష లో గల తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టే క్రమంలో అదే గ్రామానికి చెందిన మీరా రాజా మరియు అజ్మీర రవి అనేవారు ఆ ఇంటి స్థలం మీద నకిలీ దస్తావేజులు సృష్టించి,  ఇంటి నిర్మాణాన్ని దాడి చేసి అడ్డుకుంటున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని తగిన న్యాయం చేయవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి లక్ష్మీదేవిపల్లి తాహశీల్దార్ కు ఎండార్స్ చేశారు.

ఇల్లందు మండలం సత్యనారాయణపురం గ్రామంలో నివసిస్తున్న చీమల లావణ్య  D/o రాములు బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి ఉన్నానని, తాను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని, భర్త నుంచి విడిపోయి ఒంటరి మహిళగా జీవనం సాగిస్తున్నానని, ఇద్దరు పిల్లలతో జీవనం సాగించడం కష్టతరంగా మారినందువల్ల జిల్లా పరిధిలో వైద్య శాఖలో ఉపాధి కల్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించి జిల్లా వైద్య శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.

లక్ష్మీదేవి పల్లి మండలం మాదిగప్రోలు గ్రామం లో నివసిస్తున్న చీమల విజయ తన భర్త అనారోగ్య కారణంగా  ఏడు సంవత్సరాల క్రితం మరణించాడని, తన కుమారులు ఎవరు పట్టించుకోవట్లేదు అని, అనారోగ్య కారణం చేత కూలి పని చేసుకోలేని స్థితిలో ఉన్నానని, వితంతు పెన్షన్ కు పలుమార్లు దరఖాస్తు చేసిన మంజూరు కాలేదని, తన వితంతు పింఛన్ మంజూరు చేయవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం డి ఆర్ డి ఓ కు ఎండార్స్ చేయడం జరిగింది.

ఇల్లందు ఇందిరా నగర్ వాసి 2020 సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో ఎడమ చేయి పూర్తిగా కోల్పోయానని, కుటుంబ పోషణ కొరకు ఏదైనా చిన్న ఉపాధి అవకాశం కల్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యల నిమిత్తం   జిల్లా విద్యాశాఖ అధికారి కి ఎండార్స్ చేశారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు  పాల్గొన్నారు.

Blogger ఆధారితం.