జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా ఫ్లాగ్ డే

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా ఫ్లాగ్ డే

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) ను హేమచంద్రాపురం లోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హాజరయ్యారు. 

 ఈ సందర్భంగా వారు పెరేడ్ కమాండర్ లాల్ బాబు ఆధ్వర్యంలోని సాయుధ దళ పోలీసుల చే గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘవిద్రోహశక్తుల చే పోరాడి చనిపోయిన పోలీస్ అమర వీరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.ప్రజల సంరక్షణ కోసం పోలీస్ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుందని,శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ,ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు  శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుందని  తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్,ఎస్పీ తోకలిసి అధికారులంతా అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సాయి మనోహర్, డిఎస్పీలు చంద్రభాను, రెహమాన్,మల్లయ్య స్వామి,రవీందర్ రెడ్డి, సతీష్ కుమార్, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, సీఐలు,ఆర్ఐలు,ఎస్సైలు,పోలీస్ కార్యాలయ సిబ్బంది,స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.