నిషేధిత గంజాయి అక్రమ రవాణా కేసులలో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలి : ఎస్పీ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న గంజాయి కేసుల గురించి మంగళవారం పోలీసు అధికారులతో ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా పెండింగ్ లో ఉన్న గంజాయి అక్రమ రవాణా కేసుల ప్రస్తుత స్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిషేధిత గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కోర్టు లో సరైన పత్రాలను, సాక్ష్యాదారాలను సమర్పించి నిందితులకు కచ్చితంగా శిక్షపడేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.మత్తు పదార్థాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన TGNAB వారి సలహాలు సూచనలతో ఎప్పటికప్పుడు జిల్లాలో నమోదైన గంజాయి కేసులలో పురోగతిని సాధించాలని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి,ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment