స్టార్ చిల్డ్రన్ స్కూల్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ మార్కెట్ ఏరియాలోని స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో మంగళవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మను తయారుచేసి ఆరాధించారు.
అనంతరం స్టార్ చిల్డ్రన్ స్కూల్ కరస్పాండెంట్ జి.భాస్కర్ రావు, ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు అందరూ ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పూల పండుగ బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వై.స్వరూప రాణి, జీ.రమాదేవి, మహేశ్వరి, స్వాతి, గీత, లక్ష్మీ,, శ్వేత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment