వెంకటస్వామి సేవలు ఆదర్శనీయం - అదనపు కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: వెంకటస్వామి నిస్వార్ధంగా రాజకీయ జీవితంలో ఎంతోమందికి సేవ చేసి యావత్తు జాతికి ఆదర్శంగా నిలిచారని అదనపు జిల్లా కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు.
శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ డి. వేణుగోపాల్ వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటస్వామి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించుటకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వెంకటస్వామి సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలు నేటి తరాలకు మార్గదర్శకమని తెలిపారు. వెంకటస్వామి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ శాఖల మంత్రిగా పనిచేశారని, ప్రజలకు విశేష సేవలు అందించారని, ఆయన త్యాగం, అంకిత భావం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి చిరస్థాయిగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిపాలన అధికారి రమాదేవి, ఎల్ డి ఎం వెంకటరామిరెడ్డి, జిల్లా ఆడిట్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డి, తాసిల్దార్ రమేష్, డి ఎం ఓ త్రినాథ్ బాబు, శ్రీనివాసరావు ఏటీవో, డి సెక్షన్ సూపరిండెంట్ యాసీన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment