రమణారెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన కానిస్టేబుల్స్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఇటీవల మృతి చెందిన 2000 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి కుటుంబానికి తమ తోటి బ్యాచ్ కానిస్టేబుళ్లు రెండు లక్షల రూపాయలను చెక్కు రూపంలో శనివారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ చేతుల మీదుగా వారి కుటుంబానికి అందజేసారు.
అనంతరం మృతి చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి కుటుంబ ప్రస్తుత పరిస్థితులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, 2000 బ్యాచ్ కు చెందిన సుమారు 15 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

Post a Comment