పోలీస్ జాగిలం "జూనో" ను అభినందించిన జిల్లా ఎస్పీ

పోలీస్ జాగిలం "జూనో" ను అభినందించిన జిల్లా ఎస్పీ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఈనెల 16 నుండి 19వ వరకు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్-2024 పోటీల్లో పేలుడు పదార్థాల ను కనిపెట్టే విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన జిల్లా పోలీస్ జాగీలం జూనో ను మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విభాగంలో మొత్తం 21 పోలీస్ జాగిలాలు పాల్గొనగా అందులో "జూనో" అత్యుత్తమ ప్రతిభను కనబరిచి బంగారు పతకాన్ని సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. జూనో హ్యాండ్లర్ హుస్సేన్ ను కూడా ప్రశంసించారు. ఇదే విధంగా జాతీయస్థాయిలో కూడా తన ప్రతిభను కనబరిచి రాష్ట్రానికి బంగారు పతకాన్ని సాధించే విధంగా శిక్షణను ఇప్పించాలని సూచించారు.ఈ విధంగా బంగారు పతకం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన జూనో కు ఎస్పీ రివార్డ్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఆర్ఎస్సై శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.