తొలిసారి మీడియా ముందుకు పవన్ చిన్న కూతురు
జె.హెచ్.9. మీడియా, ఆంధ్రప్రదేశ్ : పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల మొదటిసారి మీడియా ముందుకు వచ్చి అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం కాలినడకన తిరుమలకు చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు. స్వామి వారి దర్శనం నేపథ్యంలో తన ఇద్దరు కూతుర్లతో కలిసి పవన్ స్వామి వారిని దర్శించుకున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెలను మొదటిసారి మీడియా ముందుకు తీసుకురావడమే కాక శ్రీవారి దర్శనం కోసం డిక్లరేషన్ ఇప్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగులు ఇచ్చిన డిక్లరేషన్ పత్రాలపై కుమార్తె పలీనా అంజనితో సంతకాలు చేయించారు. అయితే పలీనా మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.
ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ పెద్ద కూతురు ఆధ్య, కుమారుడు అఖిరా నందన్ తరుచూ మీడియాలో కనిపించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం అయ్యారు.అయితే పవన్ కల్యాణ్ చిన్న కూతురు బయటి ప్రపంచానికి అంతగా తెలియకపోవడం.. సడన్‌గా తండ్రి, అక్కతో కలిసి తొలిసారి మీడియా ముందుకు రావడం తో ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. చాలామంది ఇప్పుడు ఈ ఫొటోల గురించి, పవన్ చిన్న కూతురు గురించే మాట్లాడుకోవడం విశేషం.

Post a Comment