సూపర్ స్టార్ రజినీకాంత్ కు అస్వస్థత
సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర కడుపు నొప్పితో సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ ఆధ్వర్యంలో రజనీకాంత్ కు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కానీ రజీని ఆరోగ్య పరిస్థితి పై ఇప్పటివరకు కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వర్గాలు ఇంకా ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. ఆయనకు ఇంకా కొన్ని టెస్టులు చేయాల్సి ఉందని సమాచారం.
రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు అనే వార్త బయటకు రావడంతో ఆయనకు ఏమైందోనని తలైవా అభిమానులలో ఆందోళన నెలకొంది. పలువురు అభిమానులు తలైవా త్వరగా కోలుకోవాలంటూ దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెట్టయన్ ది హంటర్ సినిమా 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవల్ రాజా దర్శకత్వం వహించారు.

Post a Comment