లెజెండ్రీ యాక్టర్ మిథున్ కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

 

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు లెజెండ్రీ యాక్టర్ మిథున్

జె.హెచ్.9. మీడియా,జాతీయం::మిథున్ చక్రవర్తి 1982 లో I am a Disco Dancer అంటూ నాటి కుర్ర కారులను ఒక ఊపు ఊపిన స్టార్. కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో తనకంటూ సపరేటు స్టైల్ మెయిన్ టైన్ చేస్తూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు మిథున్.  ఈ ఏడాది దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు లెజెండ్రీ యాక్టర్ మిథున్ కు వరించింది.  

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 74 ఏళ్ల మిథున్‌ గత కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్ లో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు.1976 లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మిథున్ తొలి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన సినీ కెరియర్ లో మొత్తం 3 నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నారు.  1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్‌ సినిమాతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగాలీ, హిందీ, ఒడిశా, భోజ్‌పురి, తమిళ్‌, కన్నడ, పంజాబీలో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించారు. ఈయన కెరీర్​లో భారీ బ్లాక్​ బస్టర్ లు ఎన్నో ఉన్నాయి. 

అయితే భారత్​ లో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం కు మిథున్‌ చక్రవర్తి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ నేషనల్ ఫిల్మ్​ అవార్డ్స్​ వేడుకలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయన అందుకోనున్నారు. ఈ విషయాన్ని యూనియన్ మినిస్టర్​ అశ్విని వైష్ణవ్​ ట్వీట్​ ద్వారా తెలిపారు.

మిథున్‌ చక్రవర్తి  తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. పవన్ కల్యాణ్ గోపాల గోపాల సినిమాలో స్వామీజీగా నటించి మెప్పించారు. 

రాజకీయాలపై ఆసక్తితో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరి 2014లో రాజ్యసభకు కూడా వెళ్లారు. కానీ రెండేళ్లకే ఆ పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరారు. మిథున్‌ చక్రవర్తి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు కు ఎంపిక కావడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.