కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ - ప్రకాష్ రాజ్
జె.హెచ్.9. మీడియా, ఆంధ్రప్రదేశ్ : నటుడు ప్రకాష్ రాజ్ రోజుకొక ట్వీట్ తో పవన్ కళ్యాణ్ కు చురకలంటిస్తున్నారు. తిరుమల లడ్డు ప్రసాదం వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సందించారు.
' కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా..? ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి" అంటూ తెలుగులో ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు విషయంలో దీక్షలు చేస్తానంటూ మీడియా ముందుకు వచ్చి మరీ ప్రకటించారు. లడ్డు ప్రసాదం వివాదం గురించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ పలుసార్లు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మరోసారి పవన్ కు తనదైన శైలిలో చురకలాంటించారు ప్రకాష్ రాజ్.
ఇటీవల సుప్రీంకోర్టులో లడ్డు అంశంపై విచారణ జరిగింది. దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. లడ్డులో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా? అంటూ కోర్టు ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలంటూ హెచ్చరించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై వెంటనే నటుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు షేర్ చేస్తూ దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Post a Comment