పెద్దమ్మతల్లి దేవాలయంలో అలరించిన పాల్వంచ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి దేవాలయ ప్రాంగణములో గల కళావేదికపై తెలంగాణ పాల్వంచ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
పాల్వంచ పట్టణానికి చెందిన కళాకారులు తెలంగాణ పాల్వంచ కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పాకాల పాటి రోశయ్య చౌదరి మైసభ దుర్యోధనుడిగా ఏకపాత్రాభినయం, రావణబ్రహ్మ గా దామోదర్ రావు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునిగా రామ్మోహన్ రెడ్డి, నారదునిగా న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ ఖాసిం, వీరబ్రహ్మేంద్ర చరిత్ర నాటకంలో పోతులూరయ్య పాత్ర ఎస్.కె.మాబ్, భక్తునిగా శ్రీపాద సత్యనారాయణ పాత్రలు పోషించి భక్తులను ఎంతగానో అలరించారు. అనంతరం" రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా" పాటకు అభినయించి షేక్ బాషా అందరి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమానికి నందిగామ కు చెందిన తూర్లపాటి వెంకటేశ్వరరావు సంగీత సారథ్యం వహించారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం అధ్యక్షులు బండి లక్ష్మణ్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు యం.డి.మంజూర్, పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల కొండలరావు, పూర్ణ టి స్టాల్ నిర్వాహకుడు మంగళగిరి పూర్ణ , కళాకారులు గాంధీ, మోహన్, కాల్వ విజయ్, సాయి మౌలా, గోవర్ధన్, బండి ఎల్లారావు ,నంది వీరభద్రం, ఎస్.కె.రసూల్, ఎస్కే మీరా, పెద్దమ్మ తల్లి దేవాలయం కార్యాలయ సిబ్బంది, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment