మొదటి అదనపు జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పివిడి లక్ష్మి

మొదటి అదనపు జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పివిడి లక్ష్మి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  కొత్తగూడెం అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్న పోలిశెట్టి విజయ దుర్గలక్ష్మి కి గ్రేడ్ వన్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదోన్నతి లభించి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు కొత్తగూడెంకు శుక్రవారం బదిలీ అయ్యారు. 


ఖమ్మం ఏపీపీ గా పనిచేస్తున్న కారం రాజారావుకు పదోన్నతి లభించి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా   గ్రేడ్ 2 గా ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కొత్తగూడెం కోర్టు లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్  వసంత్ వారికి అభినందనలు తెలిపారు..

Blogger ఆధారితం.