జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:జిల్లా పోలీస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ రామాయణ గ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకీ ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శవంతులుగా జీవించి మంచి పేరు తెచ్చుకోవాలని  అన్నారు.కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు అనేదానికి వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర నిలువెత్తు నిదర్శనం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్.బి.ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో జయరాజు,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,హోమ్ గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.