గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆన్ లైన్ ఓపి సేవలు

గవర్నమెంట్ హాస్పిటల్స్  లో ఆన్ లైన్ ఓపి సేవలు


జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్: గవర్నమెంట్ హాస్పిటల్స్  లో  ఓపి కోసం   లైన్ లో గంటల తరబడి నిరీక్షించడాన్ని చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

గవర్నమెంట్ హాస్పటల్లో ఓపి పేషెంట్లు వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పేదోడికి జ్వరం దగ్గు జలుబు ఇలా ఏ రోగం వచ్చినా వెంటనే వెళ్ళేది ప్రభుత్వ దవాఖాన కే. 

అయితే అక్కడ గంటలకొద్దీ లైన్ లో నిలబడలేక పేద వాడు పడుతున్న కష్టాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆన్లైన్ ఓపి సేవలు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. యాప్ లేదా వెబ్ సైట్ క్రియేట్ చేసి పేషంట్లు ఇంటి నుంచే ఆన్ లైన్ లో ఓపి బుక్ చేసుకుని వెళ్లే అవకాశం కల్పించనుంది. పైలెట్ ప్రాజెక్టుగా సిటీలోని ఉస్మానియా, నిలోఫర్, తదితర హాస్పిటల్స్ లో ఈ తరహా పద్ధతిని అమలు చేయనుంది. తర్వాత రాష్ట్రమంతటా విస్తరించనుంది. అయితే , చదువులేని, ఫోన్లు లేని నిరుపేద ప్రజల సంగతి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాంటి వారికోసం సాధారణ ఓపి క్యూ లైన్  కూడా కొనసాగుతుందని వైద్యశాఖ స్పష్టం చేసింది . 

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిటీలోని పలు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆన్లైన్ OP కోసం ఆభ యాప్ తీసుకువచ్చింది. దీని ద్వారా దవాఖానలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఓపి నెంబర్ వస్తుంది. ఇది అటెండర్లకు చూపిస్తే జనరల్ లైన్ లో కాకుండా సపరేట్ లైన్ లో డాక్టర్ దగ్గరకు పంపిస్తున్నారు. అయితే హాస్పిటల్ కు వచ్చి స్కాన్ చేయాల్సి రావడం, చాలామందికి తెలియక పోవడం వల్ల ఉపయోగం అంతంత మాత్రమే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నుంచే ఆన్ లైన్ ఓపి సౌకర్యాన్ని తీసుకు రాబోతుండడంతో అనుహ్యస్పందన వస్తుందని ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు..



Blogger ఆధారితం.