జిల్లా కోర్టులో బతుకమ్మ వేడుకలు

జిల్లా కోర్టులో బతుకమ్మ వేడుకలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలను సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఆటపాటలతో సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ప్రతిబింబించే  విధంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ గొల్లపూడి భానుమతి, మొదటి అదనపు జ్యూడిషియన్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏ. సుచరిత, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పివిడి లక్ష్మి, లావణ్య , విశ్వశాంతి కొత్తగూడెం బార్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ , డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి నిరంజన్ రావు, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామిశెట్టి రమేష్, న్యాయవాదులు దూదిపాల రవికుమార్, నల్లమల్ల ప్రతిభ, సీనియర్ జూనియర్ న్యాయవాదులు  మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.