వృద్దులతో ఆత్మీయంగా మెలగాలి - జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి


జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: వృద్దులతో ఆత్మీయంగా మెలగాలి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. బుధవారం కొత్తగూడెంలోని చమన్ బస్తి లో గల  ముత్తబాయి మెమోరియల్ శ్రీ జ్యోతి అనాధ వృద్ధాశ్రమంను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి సందర్శించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మెడికల్ క్యాంపు, న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.  


ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ వృద్ధులకు వృద్ధాప్యం శాపం కాదని  వృద్ధులు తమ జ్ఞానం, అనుభవంతో మన సమాజాన్ని సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత వారి కుమారులు పైన ఉంటుందని, వారి పోషణను చూడకుండా నిరాధారణకు గురి చేసినట్లయితే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ ప్రకారం ఆర్డీవో కోర్టులో  దరఖాస్తును ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.  అనంతరం కొత్తగూడెం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి. రామారావు, న్యాయమూర్తి జి. భానుమతి ఆర్గనైజేషన్ కు బియ్యం,  బ్రెడ్స్ , నిత్యవసర సామగ్రిని అందించారు.    

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్  అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్  వి.పురుషోత్తం రావు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు,న్యాయవాది మెండు రాజమల్లు,  స్టాఫ్ నర్స్ జ్యోతి, ఆశ్రమం నిర్వాకులు తదితరులు పాల్గొన్నారు.





Blogger ఆధారితం.