కొత్తగూడెం జిల్లా కోర్టులో గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి లకు ఘన నివాళులు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా వారు న్యాయవాదులతో కలిసి మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని సైనిక పరంగా వ్యవసాయపరంగా పటిష్ట పరిచిన దార్శినికుడు లాల్ బహుదూర్ శాస్త్రి అని అన్నారు. స్వాతంత్రం కోసం అహింసా మార్గంలో పోరాడిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జి.భానుమతి, బి.రామారావు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం ఎస్ ఆర్ రవి చంద్ర, కార్యవర్గ సభ్యులు ఎండి సాదిక్ పాషా, దూదిపాల రవికుమార్ ప్రవీణ్ కుమార్ నల్లమల ప్రతిభ, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తమరావు, డిప్యూటీ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది ప్రతినిధులు రామిశెట్టి రమేష్, నరేష్, ప్రమీల, ఉష, రమేష్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment